News February 26, 2025

ముగిసిన జాతీయ సాంకేతిక సదస్సు

image

పాణ్యం మండలంలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో సమ్యక్ 2కే25 రిప్పుల్ జాతీయ సాంకేతిక సదస్సు మంగళవారం ముగిసింది. అర్జీఎం కళాశాలలో రెండు రోజులుగా విద్యార్థులతో కలిసి ఈ సదస్సును నిర్వహించినట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ సోఫియా ప్రియదర్శిని పేర్కొన్నారు. సాంకేతికత నైపుణ్యం పెంచుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని వారు వెల్లడించారు.

Similar News

News November 19, 2025

భీమవరం: వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రిక ఆవిష్కరణ

image

ఈనెల 19న వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నాయని తెలిపారు.

News November 19, 2025

గోదావరిఖని: మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు: సీపీ

image

నషా ముక్త్ భారత్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ పిలుపునిచ్చారు. మంగళవారం రామగుండం కమీషనరేట్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News November 19, 2025

మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

image

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.