News April 3, 2025
ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

‘పది’ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా <<15971907>>విచ్చలవిడిగా తిరగాలని<<>> భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. నిన్న యాదాద్రి(D)లో ఈతకు వెళ్లి ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
Similar News
News October 24, 2025
MBNR: కురుమూర్తి జాతర స్పెషల్ బస్సుల వివరాలిలా.!

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లాలోని పలు డిపోల నుంచి ఈనెల 27, 28, 29న జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. బస్సుల వివరాలు.. కొల్లాపూర్ డిపో నుంచి-32, MBNR-80, వనపర్తి -65, NGKL-65, NRPT-28 మొత్తం 270 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు MBNR, WNP, NGKL, కొత్తకోట, పెబ్బేరు, దేవరకద్ర, ఆత్మకూర్ మొదలగు ప్రదేశాల నుంచి నడుపుతామని అధికారులు తెలిపారు.
News October 24, 2025
కృత్రిమ వర్షం గురించి తెలుసా?

క్లౌడ్ సీడింగ్ అనే విధానంలో <<18087168>>కృత్రిమ<<>> వర్షాన్ని కురిసేలా చేస్తారు. ఈ పద్దతిలో ప్రత్యేక విమానాలు నల్లని(నింబోస్ట్రాటస్) మేఘాలపైకి వెళ్లి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాల మిశ్రమాన్ని చల్లుతాయి. దీంతో ఆ మేఘాలలోని నీటి బిందువుల ఘనీభవించి వర్షంగా కురుస్తాయి. ఈ ప్రక్రియకు 30 నిమిషాల సమయం పడుతుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం దీని కోసం రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
News October 24, 2025
NZB: 138 పేకాట కేసుల్లో 599 మంది పట్టివేత:CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 19 నుంచి 22 వరకు 138 పేకాట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు CP సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసుల్లో రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. NZBడివిజన్లో 42 కేసులు, ARMRడివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్ లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.