News April 3, 2025

ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News April 12, 2025

ఉదయం 6 నుంచే పనిచేయండి: నారాయణ

image

మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.

News April 12, 2025

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరాముడి రథోత్సవం

image

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథాన్ని అధిష్టించి మాడ వీధుల్లో విహరించారు. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

News April 12, 2025

విద్యా, వైద్యం బలోపేతంపై కృషి: MLA పద్మావతి

image

కోదాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మునగాలలో రూ.1.56కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.కోటచలం, మాజీ ఎంపీపీ ఎలక బిందు, స్థానిక నాయకులు ఉన్నారు.

error: Content is protected !!