News April 3, 2025

ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.PLEASE SHARE IT.

Similar News

News April 25, 2025

నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

image

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు. 

News April 25, 2025

భూ సమస్యల సత్వర పరిష్కారానికే భూ భారతి: SRPT కలెక్టర్

image

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మునగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.

News April 25, 2025

సిరిసిల్ల: తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి: ఎస్పీ

image

వేసవికాలంలో సెలవులు రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈతరాని వారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు. ఈత నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని ఆయన సూచించారు.

error: Content is protected !!