News March 29, 2025

ముగిసిన శిథిలాల తొలగింపు

image

భద్రాచలంలోని ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు శుక్రవారం ముగిసింది. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు, ఉపేందర్ మృతదేహలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 42గంటల పాటు సహాయక బృందాలు, అధికారులు శిధిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇంటి యజమాని శ్రీపతి దంపతులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.

Similar News

News April 3, 2025

వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2025

గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

image

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.

News April 3, 2025

సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

image

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.

error: Content is protected !!