News February 9, 2025
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కర్నూలులోని సంకల్పాగ్ వద్ద ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. గత నెల 30న ధ్వజావరోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు వైభవంగా నిర్వహించారు. పవిత్ర తుంగభద్ర నదిలో మీద పండితులు స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షి మాడవీధుల్లో ప్రదక్షణ చేసింది.
Similar News
News November 7, 2025
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: ఎస్పీ

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లాలో పోలీసు అధికారులు స్కూల్, కళాశాలల్లో అవగాహన కల్పించారు. ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఓవర్ లోడింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని సూచించారు.
News November 7, 2025
ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.
News November 7, 2025
‘మన మిత్ర’ సేవలు ప్రతి ఇంటికి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలోని వంద శాతం కుటుంబాలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుంచి ప్రతి శుక్రవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబం ‘మన మిత్ర’ యాప్ ద్వారా సేవలను వినియోగించుకునేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జడ్పీ సీఈవోలు, డీఎల్డీవోలు పర్యవేక్షించాలని సూచించారు.


