News September 9, 2024

ముగ్గురు ఎస్సైలపై ఎస్పీ విద్యాసాగర్ వేటు

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లి ఎస్ఐ లోకేశ్ రెడ్డి, ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్, ములకలచెరువు ఎస్ఐ గాయత్రీపై ఆదివారం రాత్రి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాజంపేట డీఎస్పీ ఆఫీసుకు లోకేశ్ రెడ్డి, రాయచోటికి గాయత్రి, పీలేరుకు దిలీప్ కుమార్‌లను అటాచ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News October 12, 2024

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ,పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు జారీ చేశారు.

News October 12, 2024

శ్రీకాళహస్తి స్వామివారి సేవలో బాలకృష్ణ సతీమణి

image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిహెచ్ఓ నాగభూషణం, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

News October 12, 2024

చిత్తూరులో ప్రజా పరిష్కార వేదిక వాయిదా

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 15వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.