News November 21, 2024
ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్

నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 30, 2025
నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
News October 30, 2025
నెల్లూరు: ఒక్కో హెక్టార్కు రూ.25వేల పరిహారం

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
News October 30, 2025
నెల్లూరు: హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు వచ్చాయి. 3,585 కార్పెట్లు, 3,854 బెడ్ షీట్స్ సరఫరా చేసినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ& సాధికారత అధికారిణి పి.వెంకటలక్ష్మమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 43 బీసీ హాస్టళ్లకు వీటిని పంపిణీ చేసినట్లు చెప్పారు.


