News November 21, 2024

ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ 

image

నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్‌లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

image

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో రూ.30కోట్ల వసూళ్లు

image

నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి సూచించారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పేరుకుపోయిన పన్నుల వసూళ్లపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు రూ.30 కోట్ల పన్నులు వసూలు చేయగా.. మిగిలిన రూ.16 కోట్లు ఈ నెల 15వ తేదీలోగా రాబట్టాలని ఆదేశించారు.

News March 13, 2026

యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

image

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్‌ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.