News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

Similar News

News December 22, 2024

రేపు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ 

image

కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ సోమవారం పర్యటించనున్నట్లు పెనమలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ముప్పా రాజా తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో రూ.3కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను పవన్ పరిశీలించనున్నట్లు చెప్పారు. 

News December 22, 2024

అనూష వైద్య చికిత్స బాధ్యత నాది: మంత్రి లోకేశ్

image

నూజివీడు ట్రిపుల్ ఐటీ (E1)విద్యార్ధి మురపాల అనూష(17) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని సాయం కావాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందించారు. పేద కుటుంబానికి చెందిన అనూష కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేదని తెలుపగా.. తన కార్యాలయ సిబ్బంది ఆమె చికిత్స బాధ్యత తీసుకుంటారని లోకేశ్ తాజాగా హామీ ఇచ్చారు. 

News December 22, 2024

గుండెపోటుతో హాస్పిటల్‌కి వెళుతుండగా ప్రమాదం 

image

తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో సామేలు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతనిని హాస్పిటల్‌కు తీసుకు వెళుతున్న క్రమంలో ఆటో అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో సామేలు అక్కడికక్కడే మృతిచెందగా అతనికి సాయంగా వస్తున్న అతని భార్య పున్నమ్మ, ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు.