News December 19, 2024
ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం.!
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 9703622022కు వాట్సాప్ చేయండి.
Similar News
News January 14, 2025
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న థమన్, బాబీ
“డాకుమహారాజ్” చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు థమన్ మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బాబీతో కలసి అమ్మవారిని దర్శించుకున్నానని థమన్ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. కాగా 2025 సంక్రాంతికి వీరిద్దరూ పనిచేసిన “డాకుమహారాజ్” థియేటర్లలో సందడి చేస్తోంది.
News January 14, 2025
కృష్ణా: కోజాకు బలే గిరాకీ రూ.3వేలు
కోడి పందేల బరుల వద్ద పోరాడి ఓడిన పుంజు మాంసంపై డిమాండ్ అమాంతం పెరిగింది. కోజాగా వ్యవహరించే ఈ కోడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుచోట్ల కొనుగోలుదారులు రూ.2 నుంచి రూ.3వేలు పెట్టి కొన్నారు. ఇదే అదనుగా భావించిన స్వార్థపరులు పెరటి కోడి పుంజులను తక్కువకు కొనుగోలు చేసి బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి అధిక ధరలకు అమ్మకాలు జరిపారు.
News January 14, 2025
కంకిపాడులో కోడిపందేల శిబిరం వద్ద ఘర్షణ
కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.