News December 20, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

Similar News

News January 25, 2025

జలవనరుల శాఖ ఎస్ఈగా ద్వారకనాథ్ రెడ్డి

image

కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈగా ఎస్.ద్వారక నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ద్వారక నాథ్ రెడ్డి పదోన్నతిపై కర్నూలు ఎస్ఈగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా బాల చంద్రా రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.

News January 24, 2025

కర్నూలు: మెయిన్స్ పరీక్షకు 310 మంది అర్హత

image

కర్నూలులో 14వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాళ 600 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు పిలవగా మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 310 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు.

News January 24, 2025

వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్

image

గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.