News May 26, 2024
ముచ్చింతల్: సమతా మూర్తిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులోని సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య ఆలయాలు, స్వర్ణ రామానుజులను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలు గురించి వారికి సవివరంగా వివరించారు.
Similar News
News December 1, 2025
పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
News December 1, 2025
HYD మెట్రోలో ట్రాన్స్జెండర్లకి ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్లో సైతం ట్రాన్స్జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
News December 1, 2025
పాతబస్తీలో అండర్గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.


