News March 3, 2025

ముడసర్లోవ పార్కువద్ద మృతదేహం 

image

విశాఖ ముడసర్లోవ పార్కు వద్ద రోడ్డు పక్కన ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి(48) మృతి చెంది పడి ఉన్నట్లు ఆరిలోవ ఎస్ఐ రామదాసు పేర్కొన్నారు. మృతదేహంపై ఏవిధమైన గాయాలు లేకపోవడతో అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 24, 2025

విశాఖ: మ్యాచ్‌కు ఈ వస్తువులు తీసుకెళ్లొద్దు

image

ఐపీఎల్ మ్యాచ్‌కు పలు వస్తువులను నిషేధిస్తూ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు. అగ్గిపెట్టెలు, లైటర్, మద్యం సీసాలు, గుట్కా, గాజు వస్తువులు, సెంట్ బాటిల్లు, కర్రలు, తుపాకీ, టిఫిన్లు, పెంపుడు కుక్కలు, స్ప్రేలు, విజిల్లు, కెమెరాలు, సిరంజిలు, ప్రమోషనల్ ప్రొడక్ట్స్, ల్యాప్‌టాప్, పెన్నులు, పెన్సిళ్లు, కుర్చీలు, గొడుగులు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ నిషేధ వస్తువులపై నిఘా పెడతామని పోలీసులు సైతం తెలిపారు.

News March 24, 2025

విశాఖ రైతు బజార్లలో కూరగాయల ధరలు

image

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/ కేజీలలో) టమోటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళదుంప రూ.15, కాలీఫ్లవర్ రూ.24, దొండకాయలు రూ.28, దోసకాయలు రూ.18/ 26, క్యాప్సికం రూ.40, క్యారెట్ రూ.28 /38 , వెల్లుల్లి రూ.75/90/110, నల్లమిర్చి రూ.28, వంకాయలు రూ.30, బీరకాయలు రూ. 44 , కర్ర పెండ్లం రూ.20, మునగ రూ.32, అనప రూ.14గా నిర్ణయించారు.

News March 24, 2025

జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని నిలబెట్టుకుంటాం: కన్నబాబు

image

సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. టీడీపీ నీతిలేని రాజకీయం చేస్తుందని  ఆరోపించారు. తాము జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు. విశాఖలో బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో కన్నబాబు, గుడివాడ్ అమర్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!