News July 22, 2024
ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. బేడా మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News December 10, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి:కలెక్టర్
ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
News December 9, 2024
‘ఖమ్మం జిల్లాలోని రైల్వే స్టేషన్ సమస్యలు పరిష్కారించాలి’
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతి అందజేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావులు రైల్వే మంత్రిని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.
News December 9, 2024
REWIND: మహాలక్ష్మి పథకంకి ఏడాది పూర్తి
మహాలక్ష్మి పథకం అమలై ఏడాది అవుతోంది. గతేడాది ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం పాతబస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు.