News January 27, 2025

ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం భక్తులకు స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

Similar News

News November 19, 2025

అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

News November 19, 2025

ఉమ్మడి కరీంనగర్‌లో BCలకు 268 GPలే..!

image

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్‌తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

News November 19, 2025

మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

image

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.