News February 17, 2025

ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యహచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్య కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

ఆర్టీసీలో సమ్మె సైరన్.. మార్చి 13 డెడ్‌లైన్

image

TG: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, జీతాల పెంపు, పెండింగ్ బకాయిల విడుదల సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. JAC ఆధ్వర్యంలో నిన్న HYDలోని ఇందిరా పార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేశారు. మార్చి 13లోపు డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె నోటీసు ఇచ్చి మార్చి 18 తర్వాత స్ట్రైక్ చేస్తామని హెచ్చరించారు.

News February 25, 2026

ఆ భూములను కాపాడండి: అసెంబ్లీలో సోమిరెడ్డి

image

సర్వేపల్లిలో హైవే పక్కన రూ.100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి సమీక్ష చేయాలి’ అని ఆయన విన్నవించారు.

News February 25, 2026

HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

image

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.