News February 17, 2025
ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యహచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్య కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News March 27, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

AP: చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
News March 27, 2025
మంచిర్యాల: డీసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ సురేఖ..?

కాంగ్రెస్ TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో DCCలతో భేటీ అయ్యారు. కేడర్ ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆరా తీశారు. జిల్లాల్లో పార్టీని అన్నిస్థాయుల్లో ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. అయితే DCC పదవి మళ్లీ సురేఖకే కట్టబెడతారా.. లేక ఇతరులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. రేసులో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో పాటు పలువురు ఉన్నట్లు సమాచారం.
News March 27, 2025
కుక్కునూరులో 108 ఉద్యోగి పై కేసు నమోదు

కుక్కునూరులోని 108 ఉద్యోగి అజిత్ కుమార్, పీహెచ్ సీలోని ఓ మహిళా ఉద్యోగిపై అత్యాచారం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై బుధవారం కేసునమోదు చేసినట్లు HC నాగేశ్వరరావు తెలిపారు. మహిళ సన్నిహితంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఒంటరిగా ఉంటున్న ఆమె రూమ్‌కి వచ్చి, బలాత్కారం చేశాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ చాటింగ్ ద్వారా వేధించడం మొదలు పెట్టి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.