News March 15, 2025
ముత్తిరెడ్డి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో అయ్యప్ప టెంట్ హౌజ్ ఆవరణలో శుక్రవారం క్షుద్ర పూజల కలకలం రేగింది. గుర్తు తెలియని వారు టెంట్ హౌజ్ ఆవరణలో ఒక ఎర్ర బట్టలో పసుపు, ఎల్లిగడ్డ లాంటి పదార్థాలు వదిలి వెళ్లారు. గమనించిన స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని విషయాలపై అరా తీశారు.
Similar News
News November 1, 2025
ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
News November 1, 2025
నిర్మాతగా సుకుమార్ భార్య తబిత

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత నిర్మాతగా మారనున్నారు. ‘తబితా సుకుమార్ ఫిల్మ్స్’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బ్యానర్లో పదేళ్ల కిందట వచ్చిన బోల్డ్ మూవీ కుమారి21F సీక్వెల్ కుమారి22F తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రావు రమేశ్ నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు.
News November 1, 2025
సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలోని పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


