News July 31, 2024
ముత్తుకూరు: కారులోనే వ్యక్తి మృతి

ముత్తుకూరు మండల కేంద్రంలోని పోస్టాఫీస్ సమీపంలో బుధవారం రాత్రి ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. కారు ఇంజిన్ ఆన్‌లో ఉండగానే సీటులోనే మృతి చెందాడు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిది హైదరాబాద్ నగరం అమీర్ పేటకు చెందిన బాలన్నగారి ద్వారకనాధ్ రెడ్డిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News January 22, 2026
నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్ తప్పనిసరి

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 22, 2026
NLR: న్యూస్ స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తులు

నెల్లూరు జిల్లాలో డీడీ న్యూస్ స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుదారులు జిల్లాలోనే నివసిస్తూ, అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు రూ.1,180 ప్రాసెసింగ్ ఫీజుతో దరఖాస్తులను విజయవాడలోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి అందించాల్సి ఉంటుంది.
News January 22, 2026
నెల్లూరు మీదుగా మరో ప్రతిష్ఠాత్మక రైలు.!

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు నెల్లూరు మీదుగా వెళ్లనుంది. నెల్లూరుకు ఉదయం 5:43కు రానున్న ఈ రైలు 5.45AMకు బయలుదేరి 4:30 PMకు చర్లపల్లి చేరుకోనుంది. ఉదయాన్నే నెల్లూరు నుంచి HYD వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.


