News June 14, 2024
ముత్తుకూరు: పొంగూరు నారాయణ సూక్ష్మ చిత్రం
మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నారాయణకు శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మా రత్నం ఆయన సూక్ష్మ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా అతడిని పొంగూరు అభిమానులు, రాజకీయ నాయకులు అభినందించారు.
Similar News
News September 11, 2024
నెల్లూరు జిల్లాలో కొండెక్కిన ఉల్లి ధర
నెల్లూరు జిల్లాలో ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, పుణే నుంచి దిగుమతి అవుతున్న సరకు.. అక్కడే కిలో రూ.50 వరకు ఉండటంతో రవాణా ఖర్చులతో ఇక్కడికి చేరే సరికి మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడంతో కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు.
News September 11, 2024
పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్
ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వీఆర్వో పెంచల కిషోర్ సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
News September 10, 2024
కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త
నెల్లూరు కార్పొరేషన్‌లో జరిగిన సంతకాల ఫోర్జరీ అభియోగం కేసులో మేయర్ భర్త జయవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు జయవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. కీలక నిందితుడిగా జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.