News July 12, 2024

ముత్తు పదార్థాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రై సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాల వివరాలను పోలీస్ కమిషనర్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వరంగల్‌లో గంజాయికి సంబంధించి నమోదయిన కేసుల వివరాలను ఆరా తీశారు. డ్రగ్స్ పై కఠినంగా ఉండాలన్నారు.

Similar News

News February 8, 2025

మేడారానికి బస్సు ప్రారంభం

image

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.

News February 8, 2025

నర్సంపేట: గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపింది. గ్రామ శివారులో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక జేసీబీ , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2025

వరంగల్ ఇన్‌ఛార్జి డీటీఓగా శోభన్ బాబు

image

వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై వేటు వేశారు. వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ ప్రభుత్వం వేటు వేసిన తెలిసిందే. కాగా ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

error: Content is protected !!