News March 14, 2025
ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Similar News
News March 14, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 14, 2026
మరి కాసేపట్లో గుత్తికొట ఉత్సవాలు ప్రారంభం

గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గుత్తి కోట ఉత్సవాలు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ప్రజలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేజ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.
News March 13, 2026
SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.


