News March 14, 2025
ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Similar News
News March 24, 2025
పల్నాడు: లెక్కల పరీక్షకు 25, 212 మంది విద్యార్థుల హాజరు

పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 128 సెంటర్లలో 25,212 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. 99.06శాతం ఉన్నట్లు తెలిపారు. 128 పరీక్షా కేంద్రాలను పరిశీలించేందుకు 22 సిట్టింగ్ స్క్వాడ్లు, 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వినుకొండ, నూజెండ్ల పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు.
News March 24, 2025
అల్లూరి: 10th లెక్కల పరీక్షకు 104 మంది దూరం

అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన 10th లెక్కల పరీక్షకు మొత్తం 11665మంది హాజరు కావాల్సి ఉండగా 11561మంది హాజరయ్యారని, 104 మంది గైర్హాజరయ్యారని DEO. బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. అరకువాలీ, అనంతగిరి మండలాల్లో పలు పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి కాపీయింగ్ ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని, జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్ష జరిగిందని తెలిపారు.
News March 24, 2025
భూ రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు ఎప్పుడంటే?

TG: ఎల్‌ఆర్ఎస్ గడువు పెంపు ఆలోచన ప్రస్తుతానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరని చెప్పారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు సర్వే చేయించి నిర్ధారిస్తామన్నారు. త్వరలోనే భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ విధానాన్ని అమలు చేస్తామన్నారు.