News March 12, 2025
ముదిగుబ్బ మండలంలో 120ఏళ్ల వృద్ధుడి మృతి

ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఉరుముల బుచ్చన్న (120) అనే శతాధిక వృద్ధుడు శివైక్యం చెందారు. 1905లో జన్మించిన ఆయన స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలను కళ్లారా చూశారు. వందేళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. వయసుమీద పడటంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. గొప్ప కళాకారుడిని కోల్పోయామని గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News November 13, 2025
VJA: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

తల్లిదండ్రులు మరణించడంతో మానసిక వేదనతో నెల్లూరు నుంచి విజయవాడ బస్టాండ్కు చేరుకున్న 19 ఏళ్ల యువతికి ఆటో డ్రైవర్లు అండగా నిలిచారు. ఆకలితో అలమటిస్తున్న ఆమెకు ఆహారం ఇచ్చి, కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను సురక్షిత కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ల మానవత్వాన్ని పలువురు అభినందించారు.
News November 13, 2025
మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News November 13, 2025
VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


