News March 12, 2025

ముదిగుబ్బ మండలంలో 120ఏళ్ల వృద్ధుడి మృతి

image

ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఉరుముల బుచ్చన్న (120) అనే శతాధిక వృద్ధుడు శివైక్యం చెందారు. 1905లో జన్మించిన ఆయన స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలను కళ్లారా చూశారు. వందేళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. వయసుమీద పడటంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. గొప్ప కళాకారుడిని కోల్పోయామని గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News February 12, 2026

నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

image

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.

News February 12, 2026

బ్రిటీష్ అధికారికి స్వామివారి దర్శనం

image

బ్రిటీష్ కాలంలో సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా రాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి బయటకు వచ్చి మన్రోకు దర్శనమిచ్చారు. ఆయనతో చర్చించి భూములను స్వాధీనం చేసుకోకుండా ఒప్పించారు. ఈ సంభాషణ గురించి మన్రో స్వయంగా ‘మద్రాస్ గెజిట్’లో నమోదు చేయడం విశేషం. ఓ పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన స్వామివారి కరుణా సాగరం అనంతమైనది.

News February 12, 2026

మెదక్: ఓటు వేసిన 99 ఏళ్లు వృద్ధుడు

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన 99 ఏళ్ల మర్తి కిష్టయ్య తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఓటు వేయకుండా కాలక్షేపం చేస్తున్న తరుణంలో, ఈ వయసులో కూడా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గుర్తు చేశారు. కిష్టయ్య సంకల్పాన్ని చూసి స్థానికులు, అధికారులు అభినందించారు.