News April 11, 2025

ముదిగుబ్బ: మహిళలకు బాలికలకు శక్తి యాప్ ఎంతో భద్రత

image

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని మంగళమడక గ్రామంలో గురువారం రాత్రి ఎస్పీ రత్న నేర నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ప్రతి మహిళ ఫోన్‌లో ఉంచుకోవాలని వాటి ఉపయోగాల గురించి తెలిపారు. ప్రతి తల్లిదండ్రి విద్యార్థులకు మంచి చెడు స్పర్శల గురించి చెప్పాలన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపట్ల అప్రమత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ మహేష్, సీఐ శ్యామ్ రావు పాల్గొన్నారు.

Similar News

News March 13, 2026

40ల్లో ఈ తప్పులు చేయకండి!

image

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్‌లో జాబ్ మారేటప్పుడు PF విత్‌డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.

News March 13, 2026

NLG: అక్రమ గ్యాస్ వినియోగంపై ఉక్కుపాదం

image

జిల్లాలో డొమెస్టిక్(వంట గ్యాస్) సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం నల్గొండతో పాటు మల్లేపల్లి గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు.

News March 13, 2026

చెరువుగట్టు రామలింగేశ్వరుడికి భారీ ఆదాయం

image

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది రూ.13 లక్షలకుపైగా అదనపు ఆదాయం లభించింది.