News February 11, 2025
ముదిగొండ: ఉరేసుకుని ఆటో డ్రైవర్ సూసైడ్

ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన రెహ్మాన్(28) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ల్లయ్య అనే వ్యక్తి నుంచి అతడి తల్లి రూ.50 వేలు అప్పు తీసుకుంది. ఆదివారం పుల్లయ్య రెహ్మాన్‌ను అప్పు చెల్లించాలని అడిగినట్లు తండ్రికి చెప్పాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకున్నట్లు తండ్రి పోలీసులకు తెలిపాడు. కేసు నమోదైంది.
Similar News
News November 18, 2025
‘ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలి’

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీలకు సంబంధించిన అంశాలపై ఆమె మరో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.

News November 17, 2025
పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.