News July 6, 2024
ముదినేపల్లి: కత్తిదాడి ఘటనలో మహిళ మృతి

ముదినేపల్లి మండలం చిగురుకోటలో నడకదారిలో మురుగునీటి విషయమై ఈ నెల 3న <<13559596>>కత్తులతో దాడి చేసిన ఘటన<<>>లో, తీవ్ర గాయాలకు గురై అపస్మారక స్థితిలో ఉన్న పరసాదేవి (32) అనే మహిళ శుక్రవారం చనిపోయింది. ఈ ఘటనలో పరసా వెంకట బాలాజీ, అతని భార్య దేవిపై బాలాజీ తమ్ముడు సురేశ్, అతని భార్య అనిత కత్తితో దాడి చేసిన విషయం విదితమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవి శుక్రవారం మృతి చెందిందని SI వెంకట్ తెలిపారు.
Similar News
News December 7, 2025
కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.
News December 7, 2025
2.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తం 287 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందని జేసీ నవీన్ తెలిపారు. గత ఏడాది ఇదే రోజుకి 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,46,473 మెట్రిక్ టన్నులు RSKల ద్వారా సేకరించినట్లు తెలిపారు. మొత్తం 29,668 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొని 48 గంటల్లో నగదు జమ చేశామన్నారు.
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.


