News February 24, 2025
ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.
Similar News
News November 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

మల్యాల: తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వ్యక్తిపై దాడి

తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిందిగా ఓ వ్యక్తిపై ముగ్గురు దాడిచేయడంతో మల్యాల PSలో ఫిర్యాదు చేశారు. SI నరేష్ ప్రకారం.. పాలకుర్తి మండలానికి చెందిన దోమల రమేష్ 3 రోజుల క్రితం కొండగట్టుకు రాగా, అక్కడి నుంచి నాగరాజు, బాబు, అంజయ్య అను ముగ్గురు వ్యక్తులు కారులో HYD తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించి తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.