News April 5, 2025
ముదినేపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతి

కాకినాడ(D) గండేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డిగ్రీ విద్యార్థి బాడవుల కేదార్ మణికంఠ(21) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం.. ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన మణికంఠ రాజమండ్రిలో చదువుతున్నాడు. ఫ్రెండ్ విష్ణువర్ధన్‌తో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
Similar News
News April 7, 2025
అన్నమయ్య: డిప్యూటీ కలెక్టర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

సంబేపల్లె మండలం, యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు నారా చంద్రబాబునాయుడు సూచించారు.
News April 7, 2025
గద్వాల: సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన సరిత

గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సరిత కేటీదొడ్డిలో ఈరోజు ప్రభుత్వం అందించిన సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు. సరిత మాట్లాడుతూ.. పేదలకు కడుపునిండా తిండి అందించాలని ప్రభుత్వ సంకల్పమని అన్నారు. మహిళలు కాంగ్రెస్ పథకాన్ని ప్రశంసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, సరితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఆనంద్ గౌడ్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News April 7, 2025
WGL: క్వింటా పసుపు ధర రూ.12,126

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పలు చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాల్ ధర రూ.6,500, పచ్చి పల్లికాయ రూ.4,200 పలికింది. అలాగే పసుపు క్వింటాల్ ధర రూ.12,126, మక్కలు(బిల్టీ) క్వింటాల్ ధర రూ.2,280 పలికినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.