News July 20, 2024

ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

image

ముదివేడు కస్తూర్భా పాఠశాలలో ముగ్గరు విద్యార్థులు రెండు రోజులు క్రితం ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఉన్నాధికారులు ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 12, 2024

శ్రీవారి పాదాల మార్గం మూత

image

తిరుమలలో భారీ వర్షాల కురుస్తోన్న నేపథ్యంలో TTD అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి వారి ఆలయం మార్గంతో పాటు శ్రీవారి పాదాల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిని తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News December 12, 2024

తిరుపతి జిల్లాలోనూ సెలవు

image

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News December 12, 2024

పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: చిత్తూరు JC

image

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.