News February 18, 2025
ముద్దనూరులో రోడ్డు ప్రమాదం

ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప నుంచి గండికోట వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 14, 2025
హోళీ పండుగపై కడప ఎస్పీ సూచనలు

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు పలు సూచనలు చేశారు. హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలవారు మతసామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా హద్దులు దాటితే ఉపేక్షించమని, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.
News March 13, 2025
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కడప కలెక్టర్

కడప జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు సంబంధించి పనుల అనుమతులను జాప్యం చేయక సంబంధిత అధికారులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు, పౌర సరఫరాల పంపిణీ తదితరులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ఎలాంటి జాప్యానికి తావివ్వక వెంటనే దరకాస్తును పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలన్నారు.
News March 13, 2025
కడప: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

కడప జిల్లాలోని కాశినాయన క్షేత్రంలోని పలు షెడ్లను అటవీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ, కూటమి నాయకులు వాడీవేడీగా మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించి.. తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఇచ్చిన మాట ప్రకారం.. నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.