News May 27, 2024
ముద్దనూరు: భార్యపై అనుమానం.. భర్త సూసైడ్

ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో ఓబులేసు (41) అనే వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఆంజనేయులు సమాచారం మేరకు.. ఓబులేసుకు 20 ఏళ్ల కిందట ఉప్పలూరుకు చెందిన కేశమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్య కేశమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకుని మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓబులేసు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News January 7, 2026
కడప జిల్లాలో 18 మంది SIల బదిలీలు

కడప జిల్లాలో ఎస్సైలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 18 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలంటూ ఆయన ఆదేశించారు. ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో దాదాపు SIలకు స్థాన చలనం కల్పించారు.
News January 7, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,110
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.12,981
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.
News January 7, 2026
BREAKING: ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఏపీ టీమ్

69వ జాతీయ U-14 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఏపీ టీమ్ సత్తా చాటుతోంది. ఇవాళ గోవాపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం కనబరిచి మరో 2 సెట్లు ఉండగానే విజయం సాధించింది. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. రేపు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది.


