News May 27, 2024

ముద్దనూరు: భార్యపై అనుమానం.. భర్త సూసైడ్

image

ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో ఓబులేసు (41) అనే వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఆంజనేయులు సమాచారం మేరకు.. ఓబులేసుకు 20 ఏళ్ల కిందట ఉప్పలూరుకు చెందిన కేశమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్య కేశమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకుని మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓబులేసు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News February 19, 2025

కడప జిల్లా TODAY టాప్ న్యూస్

image

➣ కడప: ‘ముస్లింలు అంటే సీఎంకు చిన్నచూపు’
➣ గోపవరం: గుండెపోటుతో 24 ఏళ్ల యువకుడు మృతి
➣ సిద్దవటం మండలంలో భారీ చోరీ
➣ 22న ప్రొద్దుటూరులో మినీ జాబ్ మేళా
➣ లింగాలలో పట్టుబడిన చీనీ కాయల దొంగలు
➣ కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
➣ కమలాపురం: నలుగురి పిల్లలతో తల్లి జీవన పోరాటం
➣ గండికోటలో సెల్ఫీ తీసుకున్న కలెక్టర్, MLA
➣ జగన్‌పై జమ్మలమడుగు MLA ఫైర్

News February 19, 2025

కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

కడప జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.

News February 19, 2025

గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

image

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.

error: Content is protected !!