News September 1, 2024
ముద్దనూరు మండలంవ్యాప్తంగా 57 పింఛన్లు తొలగింపు
ముద్దనూరు మండలం సామాజిక పింఛన్లకు అనర్హులైన కొందరు లబ్దిదారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్న 57 మందిని ప్రభుత్వం తొలగించినట్లు ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర్ తెలిపారు. ఆ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల తదితర పింఛన్లు 5,318 ఉన్నాయన్నారు. కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్నారన్నారు.
Similar News
News September 19, 2024
కడప: 100 రోజుల TDP పాలనపై మీ కామెంట్?
కడప జిల్లాలో 7 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
News September 19, 2024
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు
విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.
News September 18, 2024
కడప: వరద బాధితులకు 1వ తరగతి విద్యార్థిని విరాళం
విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. వివరాలిలా ఉన్నాయి. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయం చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్‌తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌కు తన పాకెట్ మనీ రూ.72,500 విరాళంగా అందించింది.