News February 9, 2025

ముధోల్: ఇంటి నిర్మాణాల తవ్వకాల్లో పురాతన నాణేలు 

image

ముధోల్ మహాలక్ష్మిగల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటిని నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పిల్లర్ కోసం తవ్వుతుండగా మట్టి కుండలో 92 అతి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ్, తహశీల్దార్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలించారు. నాణేలను జిల్లా ఖజానా కార్యాలయంలో జమ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.

Similar News

News March 22, 2025

GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News March 22, 2025

డీలిమిటేషన్ అమలైతే మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు: CM రేవంత్

image

TG: డీలిమిటేషన్ విషయంలో BJPని అడ్డుకోవాలని CM రేవంత్ అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ‘జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తున్నారు. రూపాయి పన్ను కట్టే తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి రూ. ఆరు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News March 22, 2025

కర్ణాటక యువకుడి ఆత్మహత్య

image

పరిగి మండల పరిధిలోని జయమంగళి నదీ పరిసరాల్లో కర్ణాటకకు చెందిన రాజేశ్ అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిబ్బంది కలిసి ఎస్ఐ రంగుడు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పురుగు మందు బాటిల్‌తో పాటు కూల్ డ్రింక్ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!