News March 4, 2025
ముధోల్: ఇంట్లో పట్టపగలే బంగారం చోరీ

ముధోల్ మండలం వడ్తాల్ గ్రామంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. ఎస్ఐ సంజీవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భోజవ్వ తన కూతురి పెళ్లి కోసం బ్యాంక్లో డిపాజిట్ చేసిన నగలను కొన్ని రోజుల క్రితం తీసుకువచ్చి ఇంట్లోని బీరువాలో దాచిపెట్టింది. కాగా సోమవారం దుండగులు 4 తులాల బంగారం, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
News March 4, 2025
సూర్యాపేట: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్..

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలు సబ్జెక్టుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉన్నారు.
News March 4, 2025
MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.