News February 16, 2025

ముధోల్: కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మృతి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు నాగేష్ శాస్త్రి HYDలోని ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి, దివంగత నేత గడ్డేన్నకు శిష్యుడిగా పేరొందారు. ఆదివారం ఉదయం 11గంటలకు స్వగ్రామం ముధోల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News April 17, 2026

ఉమ్మడి కరీంనగర్‌లో జనాభా వివరాలు ఇలా..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం జనాభా 33,26,410 మందిగా సర్వేలో తేలింది. ఇందులో జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా 10,19,151 మంది ఉండగా, KNR జిల్లాలో 10,10,464, పెద్దపల్లి జిల్లాలో 7,28,802, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యల్పంగా 5,67,993 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా BCలు 22,34,494 (67.18%)తో ముందుండగా, SCలు 6,56,230 (19.72%), STలు 88,120 (2.65%), OCలు 3,47,566(10.45%) మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

News April 17, 2026

MDK: ప్రశ్నాపత్రంలో లోపాలు.. ఎంబీబీఎస్ పరీక్ష రద్దు

image

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.

News April 17, 2026

సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బహిరంగ సభా ప్రాంగణం వద్ద పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.