News August 12, 2024
ముధోల్: ‘నా భర్తను స్వదేశానికి రప్పించండి’
కువైట్ దేశంలో చిక్కుకున్న ముధోల్ మండలం వాసి రాథోడ్ నాందేవ్‌ను స్వదేశానికి తిరిగి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ అధికారి అమిత్ కుమార్‌ను హైదరాబాద్‌లో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాధితుడి కుటుంబ సభ్యులు కలిశారు. క్లీనింగ్ అని చెప్పి ఏజెంట్ కువైట్ దేశానికి పంపించడంతో అక్కడ ఎడారిలో ఒంటెలు మేపుతూ భర్త ఇబ్బందుల పాలవుతున్నాడు అని ఆమె వాపోయారు.
Similar News
News September 18, 2024
ADB: ఆ గ్రామంలో 10 మంది కవల పిల్లలు.. గుర్తించలేక తికమక..!
తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు) కనిపిస్తారు. ఈ కవలల్లో ఎవరు ఎవరో అని గ్రామస్థులే కాదు తల్లిదండ్రులు కూడా గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో 10 మందికి పైగా కవలలు ఉండటంతో వీరిని గుర్తించే విషయంలో గ్రామస్థులు తికమక పడుతుంటారు. గ్రామంలో గౌతమి-గాయత్రి, వర్షిత్-హర్షిత్, కావ్య- దివ్య, రామ్-లక్ష్మణ్ అని వారిని పలకరిస్తారు.
News September 18, 2024
భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం
భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్‌నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.
News September 17, 2024
ఆదిలాబాద్: ఆర్టీసీ గమ్యం యాప్‌పై ప్రయాణికులకు అవగాహన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టేజ్ వద్ద ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసి గమ్యం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ప్రయాణించే బస్సు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.