News April 18, 2025

మునగ సాగు రైతుకు కొత్తగూడెం కలెక్టర్ సత్కారం

image

పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు కొప్పుల వర్మ ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో సాగు చేస్తున్న మునగ తోటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మునగ తోట పెంచడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అభయమిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్ కుమార్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2025

వర్షం మొదలైంది..

image

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News April 20, 2025

రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల 

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.

News April 20, 2025

పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో మృతదేహం 

image

మోత్కూరు మండలం పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్ రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. 

error: Content is protected !!