News January 31, 2025

మునుగోడు: ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తి

image

మునుగోడు మండల పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనను అధికారులు పూర్తి చేశారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంలో వెల్మకన్నె ఎంపీటీసీ స్థానం కలవడంతో దానిని తొలగించారు. ప్రస్తుతం ఉన్న 31 గ్రామ పంచాయతీలను 13 ఎంపీటీసీ స్థానాలుగా గుర్తించారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 2వేల ఓటర్లు ఉండేలా సిద్ధం చేశారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీవో శాంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 16, 2025

NLG: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

News February 16, 2025

పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

News February 16, 2025

NLG: సుదీర్ఘ నిరీక్షణకు తెర!

image

డీఎస్సీ 2008లో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి AP రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా D.Ed అభ్యర్థులకు కేటాయించడంతో B.Ed అభ్యర్థులు నష్టపోయారు. 17 ఏళ్ల వారి న్యాయ పోరాటానికి హైకోర్టు తెరదించింది.

error: Content is protected !!