News February 22, 2025

మునుగోడు: ధరణి ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్

image

మునుగోడు తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ధరణి ఫైళ్లను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీఓ శ్రీదేవి తదితరులు ఉన్నారు.

Similar News

News February 23, 2025

NLG: నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

image

SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో, SC, ST గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం NLGలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 12,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మైనార్టీ గురుకులానికి సంబందించి ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News February 23, 2025

నల్గొండ: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

image

NLG, యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ మాంసప్రియులను వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. నిడమనూరు మండలంలో నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. CPL మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

News February 23, 2025

మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం

image

మిర్యాలగూడ మండలం చింతపల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్, బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!