News September 12, 2024
మున్నేరు ముంపును పరిశీలించిన కేంద్ర బృందం
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహ కల్పలో వరద ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు నివేదికను కోరారు. కేంద్ర బృందం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.
Similar News
News October 6, 2024
రఘునాథపాలెం: బతుకమ్మ పూల కోసం వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి
రఘునాథపాలెం మండలం పాపడపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఆదివారం మిట్టపల్లి చరణ్ తేజ్ బతుకమ్మ కోసం డాబాపైన పూలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తాకి షాక్‌కు గురై మృతి చెందాడు. పలుమార్లు విద్యుత్ అధికారులకు వైర్లు కిందకు ఉన్నాయని చెప్పిన పట్టించుకొలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
News October 6, 2024
ఖమ్మం: వెదురు కోసం వెళ్లి గుండెపోటుతో మృతి
గుండెపోటులో వ్యక్తి చనిపోయిన ఘటన తల్లాడ మండలం జగన్నాథపురంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లికార్జునరావు (50) శనివారం ఉదయం వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లాడు. గుండెనొప్పి వస్తోందని మధ్యాహ్నం తనతో ఉన్నవారికి చెప్పాడు. వారు మల్లికార్జునరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
News October 6, 2024
దేశానికి రోల్ మోడల్‌గా కొత్త చట్టం: మంత్రి
ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అలా తాము చేయబోమన్నారు.