News February 12, 2026

మున్సిపల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: వనపర్తి కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభం కానుందని పేర్కొన్నారు. మూడంచెల పోలీస్ భద్రత నడుమ ప్రశాంతంగా ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించి కౌంటింగ్‌ను విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News March 13, 2026

అక్షరాంధ్ర పరీక్షకు 100% హాజరు కావాలి: కలెక్టర్

image

ఈ నెల 15న నిర్వహించే అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 100 శాతం హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లా సూచించారు. శుక్రవారం టీసీ ద్వారా సంబంధిత అధికారులతో పరీక్షా ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో అక్షరాంధ్ర కింద 1,27,627 మందిని గుర్తించామన్నారు. వీరందరూ అక్షరాస్యులుగా మారాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 2,000 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు.

News March 13, 2026

ఎల్పీజీ పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలి: నిర్మల్ ఎస్పీ

image

జిల్లాలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలను కట్టడి చేయాలని ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ ఉంచడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

వనపర్తి: పది పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం BNSS-2023 సెక్షన్ 163 (గతంలోని 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,212 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.