News February 13, 2026

మున్సిపల్ పోరు: రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

image

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రులు ఆధిపత్యం చాటుతూ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తుండగా.. నిర్మల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరి కళ్లు రెండో రౌండ్ ఫలితాలపైనే ఉన్నాయి. తుది ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయో వేచి చూడాలి.

Similar News

News March 17, 2026

24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్

image

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్‌ పోస్ట్‌’, ‘48 స్పీడ్‌ పోస్ట్‌‌’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తొలిదశలో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. వస్తువులు పోస్టు చేసిన మరుసటి రోజే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.

News March 17, 2026

జగిత్యాల: గర్భిణిని చంపేశాడు..!

image

జగిత్యాల(D) కోరుట్ల(M)మాదాపూర్‌లో భార్య వైష్ణవిని భర్త హరిబాబు <<19404399>>చంపేసిన విషయం<<>> తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు..ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ క్షణికావేశంలో హత్యకు దారి తీసింది. కాగా వైష్ణవి ప్రస్తుతం 4నెలల గర్భిణి. భార్యకు అండగా ఉండాల్సిన భర్త ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2026

పుకార్లు నమ్మొద్దు, రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: నాదెండ్ల

image

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవొద్దని ఆయన సూచించారు. రోజుకు 2.81 లక్షల బుకింగ్స్ వస్తుంటే, అంతకంటే ఎక్కువగా 2.92 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు OTP ద్వారా గ్యాస్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్యానికి వాడిన వారిపై 616 కేసులు నమోదు చేశామన్నారు.