News June 14, 2024
మున్సిపల్ శాఖా మంత్రిగా నారాయణ
జిల్లాలోని ఆత్మకూరు, నెల్లూరుసిటీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఇటీవల మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నారాయణకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పని చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Similar News
News September 9, 2024
నెల్లూరు నుంచి శబరిమలకు ఒంటికాలితో యాత్ర
నెల్లూరు నగరానికి చెందిన అక్కరపాక సురేశ్ ఆచారి వికలాంగుడు. అయినప్పటికీ ఒంటికాలితో శబరిమల పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరులో బయలుదేరి పెంచలకోన మీదుగా శబరిమలకు పాదయాత్రగా బయలుదేరాడు. సోమవారం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు చేరుకుంది. ఇలా సురేశ్ ఆచారి ఇదివరకు రెండుసార్లు పాదయాత్ర చేపట్టి మూడవసారి మొక్కు తీర్చుకునేందుకు శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు.
News September 9, 2024
నెల్లూరు: పునాస మామిడికి గిరాకీ ఎక్కువే
నెల్లూరు జిల్లాలో పునాస మామిడికి గిరాకీ పెరిగినట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు. మేలు రకం కాయలను టన్ను రూ. 60వేల నుంచిరూ.70వేలు, మసర,మంగున్న కాయలు రూ.40 – 50 వేల వరకు పలుకుతున్నాయన్నారు. అయితే ఈ రకం కాయలకు కేరళలో డిమాండ్ ఎక్కువ. అక్కడ సెప్టెంబరులో జరిగే ఓనం పండుగకు ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ప్రతిరోజూ మన నెల్లూరు నుంచి 50-60 టన్నులు ఎగుమతి అవుతున్నాయని అంటున్నారు. ఈసారి ధరలు పెరిగాయన్నారు.
News September 9, 2024
నెల్లూరు: ఉద్యోగం పేరిట మోసం ..యువకుడు సూసైడ్
ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించడంతో నెల్లూరు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం.. నవాబుపేట వాసి హరినాథ్(44) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత కంపెనీలో ఉద్యోగాలు వెతుకుతుండగా.. నెల్లూరుకు చెందిన ప్రేమ్ చంద్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7లక్షలకు పైగా తీసుకున్నాడు. బాధితుడు నిలదీయగా రూ.5.57 లక్షలు అకౌంట్లో వేశానని నకిలీ రసీదు ఇచ్చి పరారయ్యాడు. దీంతో ఈనెల 5న హరి సూసైడ్ చేసుకున్నాడు.