News February 13, 2025
మున్సిపాలిటీలకు టెన్షన్‌గా పన్ను వసూళ్లు

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.
Similar News
News December 16, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో ‘నోటు’ స్వామ్యం

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అభివృద్ధి హామీల కంటే డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీకే ప్రాధాన్యం ఇవ్వడంతో పల్లె ఎన్నికలు ‘నోటుస్వామ్యం’లా మారాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.10 వేలు, మాంసం పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ రహిత ఎన్నికల్లో జిల్లా నాయకుల ప్రచారం చర్చనీయాంశమైంది.
News December 16, 2025
ఖమ్మంలో మూడో విడత పోరుకు సిద్ధం: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 191 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇప్పటికే 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 పంచాయతీలకు 485 మంది సర్పంచ్‌లు పోటీలో ఉన్నారు. మొత్తం 2.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 318 క్రిటికల్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News December 16, 2025
KMM: నాడు టీడీపీ నుంచి భర్త.. నేడు కాంగ్రెస్ నుంచి భార్య

నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలుపొందారు. పదేళ్ల క్రితం, 2013లో టీడీపీ తరఫున ఇదే పంచాయతీ సర్పంచ్‌గా ఆమె భర్త మన్నె నగేష్ విజయం సాధించారు. పార్టీ మారినా, పదేళ్ల తర్వాత మళ్లీ వారి కుటుంబం నుంచే సర్పంచ్‌గా రాజశ్రీ ఎన్నిక కావడం స్థానికంగా ఆసక్తిని పెంచింది.


