News August 8, 2024
ముమ్మిడివరం: ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి, మోసం చేశాడంటూ యువతి ముమ్మిడివరంలో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ జ్వాలాముఖి ప్రకారం.. భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటున్న ఓ యువతిని కమిని గ్రామ పరిధిలోని వాసాలతిప్పకు చెందిన రామకృష్ణ ప్రేమ పేరుతో మోసం చేశాడు. మే నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 6, 2025
రాజమండ్రి: ఈనెల 7 జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈనెల 7 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో బీఓబీ, ఎస్బీఐ పేమెంట్స్, భరత్ పే వంటి పలు సంస్థలలోని ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తిచేసిన, 19 నుంచి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
News November 5, 2025
రాజమండ్రి: పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఆహ్వానం

జిల్లాలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పి. వెంకట చలం బుధవారం ప్రకటించారు. జలక్రీడలు, సాహస క్రీడలు, లగ్జరీ హౌస్ బోట్లు, పార్టీ బోట్ల వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి గల వారు www.tourism.ap.gov.in వెబ్సైట్లో వివరాలు చూడవచ్చని, లేదా 9505011951 / 6309942025 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
News November 5, 2025
రాజమండ్రి: సాయిబాబా శత జయంతికి కలెక్టర్కు ఆహ్వానం

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్ చేకూరి కీర్తికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఉత్సవాలకు ప్రధాని మోదీతో హాజరవుతున్నారని తెలిపారు. కలెక్టర్ తప్పనిసరిగా విచ్చేయాలని వారు కోరారు.


