News February 27, 2026
ముమ్మిడివరం: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో పితాని బాలకృష్ణ(51) అనే వ్యక్తి భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పిట్టగోడపై ఇటుకలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 15, 2026
ఖమ్మం: కళ తప్పిన జంట నగరాలు

వేలాది కార్మికులతో కళకళలాడిన కొత్తగూడెం, పాల్వంచ నగరాలు నేడు కళావిహీనంగా మారాయి. సింగరేణి గనుల మూత, కేటీపీఎస్ పాతప్లాంటు తొలగింపుతో కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీని ప్రభావం వర్తక, రియల్ ఎస్టేట్ రంగాలపై పడి వ్యాపారాలు కుదేలయ్యాయి. కార్పొరేషన్‌గా ఏర్పడినా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానికులు వాపోతున్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News April 15, 2026
నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.